Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించి.. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ .. హీరోలకు చెల్లిగా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న వైష్ణవికి బేబీ ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగ పరుచుకుంది. ఇక ఈ సినిమ కోసం ఆమె చాలా కష్టపడింది. బరువు తగ్గింది.. ఆమె పడిన కష్టం సినిమాలో కనిపించింది. వైష్ణవి పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఇక ఆమె పాత్రను దర్శకుడు సాయి రాజేష్ ఎంతో అద్భుతంగా మలిచాడు. స్కూల్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారు.. కాలేజ్ కు వెళ్ళాక ఎలా మాట్లాడతారు అనేది చక్కగా చూపించాడు. ఇక బేబీ మూవీ చూస్తే.. వైష్ణవి చేసిన పనికి తిట్టుకుంటారు కానీ, ఆమె నటన, డ్యాన్స్ ను మాత్రం ప్రతి ఒక్కరు పొగిడేస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవి ఎంట్రీ డ్యాన్స్ కు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పొచ్చు.
Nandamuri Balakrishna: ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్
వినాయకుడి ఊరేగింపులో మాస్ డ్యాన్స్ తో దుమ్మురేపింది వైష్ణవి. ఇక ఈ సాంగ్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు మరోసారి వైష్ణవి డ్యాన్స్ ను చూసి ప్రశంసిస్తున్నారు. బేబీ.. ఇద్దరబ్బాయిలను మోసం చేసినా.. ఈ డ్యాన్స్ విషయంలో నువ్వు తోపు అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా తరువాత వైష్ణవికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. మరి తన తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.