NTV Telugu Site icon

Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే

Vadhuvu

Vadhuvu

Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నలనటిగా తెలుగువారికి సుపరిచితమైంది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న అవికాను చూసి అమ్మడికి తిరుగులేదు అనుకున్నారు. కానీ, అవికాకు మాత్రం అంతగా పేరు దక్కలేదు. అడపాదడపా స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా స్టార్ హీరోయిన్ రేస్ వరకు కూడా వెళ్ళలేదు. ఇక ఆ తరువాత ఈ భామ మిగతా భాషల్లో కూడా తన సత్తా చూపడానికి ప్రయత్నించింది కానీ, అది కూడా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. ఇకపోతే ఈ మధ్య వెబ్ ఒరిజినల్స్ కు బాగా డిమాండ్ పెరగడంతో స్టార్స్ సైతం ఓటిటీ బాట పడుతున్నారు. ఇక తాజాగా అవికా కూడా ఓటిటీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే నెట్, మ్యాన్షన్ 24 లాంటి సిరీస్ లో కనిపించి మెప్పించిన అవికా.. ప్రస్తుతం వధువుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోయ్‌చాయ్‌లో ఇందు పేరుతో స్ట్రీమింగ్‌ అయిన బెంగాలీ సిరీస్‌ ను తెలుగులో వధువు పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

అవికా గోర్‌, అలీ రెజా, నందు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్.. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా .. తాజాగా వధువు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక టీజర్ లో అవికా వధువుగా కనిపించింది. పెళ్లి ఆపాలని కొందరు ట్రై చేసినా అలీ తో ఆమె పెళ్లి అవుతుంది. అత్తగారింటికి వెళ్లిన దగ్గరనుంచి ఆమె అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అత్తగారి కుటుంబం కొత్త కోడలికి చెప్పకుండా దాచిన రహస్యాలను నవ వధువు తెలుసుకుంటుందా.. ? అసలు ఆ కుటుంబంలో ఉన్న రహస్యాలు ఏంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సిరీస్ తో అవికా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Show comments