సుప్రసిద్ధ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం సంస్థ నుండి ఓ యువ కథానాయకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిని సాయి కొర్రపాటి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో గ్రాండ్ గా జరుగబోతోంది. కన్నడ చిత్రం ‘మాయాబజార్’ను తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతుండగా, ‘బాహుబలి’ ఫేమ్ సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించే ఈ చిత్రానికి పీటర్ హెయిన్ స్టంట్ కొరియోగ్రాఫర్. సినిమాల్లోకి రావాలనే ఆలోచన మనసులోకి వచ్చినప్పటి నుండే కిరీటి విదేశంతో పాటు స్వదేశంలోనూ నటన, నృత్యం, పోరాటాలలో శిక్షణ తీసుకున్నాడు. మార్చి 4న జరిగే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నట్టు తెలిసింది.
