Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గణపతి యాంథేం .. ఈ ఏడాది వినాయకచవితి వేడుకల్లో ఎలా మారుమ్రోగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఉయ్యాలో ఉయ్యాలో.. నా ఊపిరే నీకు ఉయ్యాలా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో బాలయ్య అన్న కూతురుగా శ్రీలీల నటిస్తోంది. చిన్నతనం నుంచి శ్రీలీల.. బాబాయ్ ఒడిలోనే పెరిగినట్లు ఈ సాంగ్ లో కనిపిస్తుంది.
Devara: బిగ్ బ్రేకింగ్.. దేవర ఒకటి కాదు రెండు.. కన్ఫర్మ్
కూతురికి అన్ని తానే అయ్యి పెంచే బాబాయ్ గా బాలయ్య అద్భుతంగా కనిపించాడు. ఆమెకు ఏం కావాలన్నా చిటికెలో తీసుకొచ్చి పెట్టి.. ఎవరు లేని ఒంటరి బతుకులో చిన్నారికి మాత్రం ఏ లోటు లేకిడ్నా ప్రేమను అందించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని అనంత్ శ్రీరామ్ తన లిరిక్స్ లో చూపించగా.. ఎస్పీ చరణ్ తన మెస్మరైజింగ్ గొంతుతో ఎస్పీబీని గుర్తుచేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
