Regina Utsavam Movie Relesing This September: కళాకారులు, నాటకాల నేపథ్యంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ‘రచ్చ’ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ చిత్రాని రూపొందించారు.
Also Read: TFJA: జ్యోతిష్యుడు వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు చాలా క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ‘ఉత్సవం’ లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.