Ustaad Bhagatsingh: ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagatsingh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పాట పాడేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన కాంబో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా..? ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్స్ వస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం నుంచి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తామని చెప్పుకొస్తూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితమే ఉస్తాద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్.. అదరగొట్టేశాడు. ఇక పోస్టరే ఈ రేంజ్ లో ఉంటే.. దానికి మించి ఫస్ట్ గ్లింప్స్ లో ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా ఏ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ చెప్పినట్లుగానే ఈ ఫస్ట్ గ్లింప్స్.. రచ్చ రేపుతోంది.
“ఏ కాలమున ధర్మముకు హాని కలుగునో.. అధర్మం మృతినొందునో.. ఆయా సమయంనందు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్న..భగత్.. భగత్ సింగ్.. మహంకాళీ పోలీస్ స్టేషన్.. పత్తర్ ఘంజ్, పాత బస్తీ” అంటూ పవన్ ఊర మాస్ పోలీస్ లుక్ అదిరిపోయింది. గబ్బర్ సింగ్ లో క్లాస్ గా కనిపించిన పవన్.. ఈసారి మాస్ లుక్ లో చింపేశాడు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. హట్.. సాలే అని చివరి డైలాగ్ అయితే హైలైట్ గా నిలిచింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో హీరోయిన్ శ్రీలీలను కూడా ఒక షాట్ లో చూపించారు. తేరి రీమేక్ కు, ఈ గ్లింప్స్ కు సంబంధం లేనట్లు కనిపిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలే మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!