Ustaad Bhagath Singh:దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఏపీ ఎలక్షన్స్ హీటెక్కిపోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. నేడు అమెజాన్ ఈవెంట్ లో ఈ సినిమా నుంచి కొత్త టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మొదటినుంచి ఈ సినిమాలో పవన్.. పొలిటికల్ పంచ్ లు వేస్తాడు అని ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాస్ గురించే పవన్ డైలాగులు చెప్పుకొచ్చాడు. ఇందులో పవన్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇక జాతరతో మొదలైన ఈ టీజర్ లో టెంపర్ వంశీ.. టీ గ్లాస్ ను చూపించి నీ రేంజ్ ఇది అంటూ కిందకు పడేస్తాడు. ఇక అప్పుడు ఎర్ర కండువాతో ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఊచకోత మొదలుపెడుతూ.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే యాక్షన్ సీన్స్ లో గులాబీలా ఒక్క షాట్ లో శ్రీలీల మెరిసింది. ఆ తరువాత.. గాజు గ్లాస్ గురించి పవన్ మరోసారి పపవర్ ఫుల్ డైలాగ్ లు వదిలాడు. ” ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం..” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదేదో సినిమా టీజర్ ను కట్ చేసినట్లు అనిపించలేదు. పొలిటికల్ గా పవన్ కు హరీష్ చేసిన సాయం అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.