NTV Telugu Site icon

Harish Shankar: ఏమో అనుకున్నాం కానీ, మాస్టారూ.. మామూలోళ్లు కాదండీ బాబు మీరు

Harish

Harish

Harish Shankar: ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా డైరెక్టర్ హరీష్ శంకర్ గురించే చర్చ. గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయం తరువాత హరీష్ శంకర్ అంతటి ఇండస్ట్రీ హిట్ ను అందించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక పవన్ కళ్యాణ్ కు .. వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసింది హరీష్ శంకరే. వీరిద్దరి కాంబోలో ఇన్నాళ్ల తరువాత ఒక సినిమా వస్తుంది అంటే.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు. మధ్యలో పవన్ రాజకీయాలు, వేరే సినిమాల కమిట్ మెంట్స్ తో ఏడాది గడిచిపోయింది. ఇక అందులోనూ.. ఈ సినిమా కోలీవుడ్ మూవీ తేరికి రీమేక్ అనేసరికి అభిమానుల ఆశలు నిరాశలుగా మారాయి. హరీష్ శంకర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా హరీష్ తొణకలేదు.. బెణకలేదు.. సినిమా రీమేకే కాదనడం లేదు.. కానీ, అది కేవలం లైన్ మాత్రమే తీసుకున్నాం.. మిగతాది అంత తన ఒరిజినల్ కథ అని చెప్పినా ఫ్యాన్స్ వినలేదు.. సరే గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు చూసుకుందాం అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ తరుణం వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ ను ఊర మాస్ లుక్ లో చూశాకా.. సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. పాత బస్తీ పోలీసాఫీసర్ గా పవన్ కనిపించాడు.. గబ్బర్ సింగ్ లో ఎలాంటి రేంజ్ ను ఉహించామో.. ఇందులో అంతకు మించి చూపించాడు. చెప్పినట్లే.. తేరి రీమేక్ లా కాకుండా తన పంథాలో సినిమాను తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఏమో అనుకున్నాం కానీ, మాస్టారూ.. మామూలోళ్లు కాదండీ బాబు మీరు అంటూ పొగిడేస్తున్నారు.ఫస్ట్ గ్లింప్స్ కే ఈ రేంజ్ లో ఉంటే .. టీజర్, ట్రైలర్, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేశాడట హరీష్ శంకర్.. మరి ఈ సినిమాతో ఈ కాంబో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Show comments