Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్

Pawan Kalyan Ustad

Pawan Kalyan Ustad

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. ‘కాలరే ఎత్తరా’ పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్‌లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు.

Also Read:Rashmika : ఇప్పటిదాకా భరించా.. ఇక సహించేది లేదు: లీగల్ నోటీసులు పంపుతా..రష్మిక హెచ్చరిక!

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ శక్తివంతమైన సాహిత్యం కలిసి.. సినిమా యొక్క మాస్ అప్పీల్‌ను ప్రతిబింబించేలా గొప్పగా ఉంది ఈ గీతం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. మాస్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో కూడిన ఒక మంచి చిత్రాన్ని రూపొందించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం విశేషం. మార్చి 14వ తేదీన ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం. అనంతరం మార్చి 15వ తేదీన భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది.

Exit mobile version