రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ అయిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సినిమా ‘VD 13’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ యుఎస్ లో జరగాల్సి ఉంది కానీ వీసాల ఇష్యూ రావడంతో… చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త ప్లేస్ లో షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
యుకే లేదా బ్యాంకాక్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి విజయ్ దేవరకొండ, పరశురామ్ రెడీ అవుతున్నారు. VD 13 ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా ఇటీవలే ప్రకటించారు మేకర్స్. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి… సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలబెట్టడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. VD 13 ఎంట్రీతో 2024 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి… ఖచ్చితంగా దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతాడు కానీ… మహేష్ బాబు, రవితేజ, నాగార్జునతో విజయ్ దేవరకొండకు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. రీసెంట్‌గా ఖుషి సినిమాతో కాస్త పర్వాలేదనిపించిన రౌడీ… ఈ సినిమాతో క్లీన్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి VD 13 ఎలా ఉంటుందో చూడాలి.