Urvashi Rautela: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెడుతున్న చర్చల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ వివాదం ఒకటి. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియని విషయం. కొన్నేళ్లు ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కనిపించింది. ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా రిషబ్ పై విరుచుకుపడింది హాట్ బ్యూటీ. ఒక ఇంటర్వ్యూలో “ఆర్పీ అనే వ్యక్తి నా కోసం చాలా సేపు ఎదురుచూశాడు.. నేను అలసటగా ఉండి పడుకున్నాను. తరువాత చూస్తే చాలా ఫోన్ కాల్స్.. నేను సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా నాకోసం గంటల తరబడి ఎదురుచూశాడు” అని చెప్పుకొచ్చింది. అందుకు రిషబ్ తనదైన రీతిలో అక్కా నన్ను వదిలేయ్ అంటూ సింగిల్ లైన్ లో కౌంటర్ ఇచ్చాడు. ఇక అప్పటికి తగ్గని ఊర్వశి .. నువ్వో పిల్ల బచ్చా.. పోయి బ్యాట్,బాల్ తో ఆడుకో అంటూ సెటైర్ వేసింది. తరువాత క్రికెట్ అంటే ఇష్టంలేదని చెప్పిన ఈ బ్యూటీ రిషబ్ ఆడుతున్న మ్యాచ్ కు స్టేడియం కు వెళ్ళింది. రిషబ్ ఓడిపోవడంతో నెటిజన్లు అమ్మడిపైన విరుచుకుపడ్డారు. నువ్వు వచ్చావ్ కాబట్టే ఇండియా ఓడిపోయిందని, రిషబ్ సరిగ్గా ఆడలేకపోయాడని ట్రోల్స్ చేశారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా రిషబ్ వీటన్నంటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ” నాఆధీనంలో లేనిదాని గురించి నేను ఆలోచాల్సిన అవసరం లేదు” అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఊర్వశి ని వదిలేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ పోస్ట్ పెట్టిన కొద్దీ గంటల్లోనే ఈ ముద్దుగుమ్మ క్షమించమని అడగడం హాట్ టాపిక్ గా మారింది. ఒక రిపోర్టర్.. రిషబ్ పంత్ గురించి చెప్పండి అని అడుగగా.. ఆమె మాట్లాడుతూ ” ఏం మాట్లాడాలి.. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకొంటున్నాను అంటే.. హ నన్ను క్షమించు అంటూ చేతులు జోడించి సారీ చెప్పింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకొనే రకం ఈమె.. మొన్నటివరకు ఎగిరెగిరి పడింది.. ఇప్పుడు అతను వద్దు అనడంతో సారీ చెప్పి సర్దుకుపోదామా అన్నట్లు అడుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
