Site icon NTV Telugu

ఇజ్రాయెల్ మాజీ ప్రధానితో హీరోయిన్ భేటీ… బహుమతిగా భగవద్గీత

Urvashi Rautela

ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మిస్ ఇండియా పోటీల కోసం తాజాగా ఇజ్రాయెల్ చేరుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఊర్వశి ఆయన నివాసంలో బెంజమిన్ తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలిసి బహుమతిగా భగవద్గీతను అందించారు. అంతేకాదు మాజీ ప్రధానికి ‘సబ్ షాందర్ సబ్ బదియా’ అనే కొన్ని హిందీ పదాలను కూడా నేర్పింది.

Read also : హనీమూన్ కోసం కత్రినా, విక్కీ లాంగ్ ట్రిప్… ఇదీ ప్లాన్

ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ “ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి, తెలివైన బెంజమిన్ నెతన్యాహు కూడా తనను మిస్ యూనివర్స్ ఈవెంట్‌కు ఆహ్వానించారు” అంతో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ అవినాష్ మిశ్రా నిజ జీవిత భార్య పూనమ్ మిశ్రాగా కనిపించనుంది. ఆమె తెలుగులో “బ్లాక్ రోజ్‌”తో సహా మరికొన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో కూడా కనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Benjamin Netanyahu נתניהו (@b.netanyahu)

Exit mobile version