NTV Telugu Site icon

Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?

Urvasi

Urvasi

Urvashi Rautela: ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఊర్వశి రౌతేలా అనే చెప్పాలి. అంటే.. సినిమాలు వరుసగా చేస్తూ… స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది అని కాదు.. అవేమి లేకుండానే అంతకుమించిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అని. 2013లో ‘ది సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ.. రావడం రావడమే.. ఈ చిన్నది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు, ఈవెంట్స్.. బాలీవుడ్ ఒక్కటేనా.. దేహ విదేశాల్లో జరిగే ప్రత్యేకేమైనా ఈవెంట్స్ కూడా అమ్మడిని ఆహ్వానించే రేంజ్ కు ఎదిగింది. ఇక ఈ మధ్యనే కేన్స్ ఫెస్టివెల్ ల్లో మొసలి నెక్లెస్ తో కనిపించి షాక్ ఇచ్చింది. దాని విలువ సుమారు రూ. 200కోట్లు అని తెలిసి జనాలు విస్తుపోయారు. అంతటి కాస్ట్లీ నెక్లెస్ అమ్మడు ధరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా ఆ ట్రోల్ నడుస్తూనే ఉంది.. తాజాగా మరో రూమర్ అమ్మడి గురించి నెట్టింట వైరల్ గా మారింది.

Priya: ప్రియా ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టేశావా..?

తాజాగా ఊర్వశీ.. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నదట. ముంబైలో నాలుగంతస్తుల బిల్డింగ్ ను ఒక్కసారిగా కొనేసి షాక్ ఇచ్చిందట. దాని విలువ ఎంతనుకున్నారు.. దాదాపు రూ.190 కోట్లు అని తెల్సుతుంది. అది కూడా దివంగత నిర్మాత యష్ చోప్రా ఇంటి పక్కన ఉన్న బంగ్లా అని టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ జనాలు నోర్లు వెళ్లబెడుతున్నారు. సువిశాలమైన గార్డెన్, పర్సనల్ జిమ్, స్విమ్మింగ్ పూల్.. అసాధారణమైన ఇంటీరియర్స్ తో ఆ బంగ్లా ధగధగ మెరిసిపోతుందట. అయితే ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు కానీ, పాపకు ఈ రేంజ్ లో ఇల్లు కొనేంత సీన్ ఉందా అని మాత్రం నెటిజన్స్ చర్చించుకోవడం విశేషం. ఈ మధ్యనే తెలుగులో కూడా ఊర్వశీ అడుగుపెట్టింది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాలలో ఐటెం సాంగ్స్ మెప్పించింది. స్టార్ హీరోయిన్లే.. అంతంత మాత్రంగా ఉంటున్న ఈ సమయంలో అమ్మడు మాత్రం రూ. 200కోట్ల నెక్లెస్.. రూ.190 కోట్ల బంగ్లా కొంటుంది అంటే మాములు విషయం కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో ముద్దుగుమ్మనే చెప్పాలి.

Show comments