Site icon NTV Telugu

Urvashi Rautela: విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఊర్వశీ

Urvashi Rautela

Urvashi Rautela

Urvashi Rautela Gives Strong Counter To Criticism: కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా.. ఓ ఇంటర్వ్యూలో రిషభ్ పంత్ గురించి పరోక్షంగా ప్రస్తావించినప్పటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఏమైనా మాట్లాడినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. హెడ్‌లైన్స్‌లోకి వచ్చేస్తోంది. రీసెంట్‌గా తాను ఆస్ట్రేలియాకు పయనప్పుడు.. ‘నా ప్రేమని అనుసరిస్తూ, ఆస్ట్రేలియాకి చేరుకున్నాను’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అంతే, ఆ క్షణం నుంచి ‘స్టాకర్’ అంటూ ఒకటే ట్రోల్ చేస్తున్నారు. రిషభ్ పంత్‌ని ఉద్దేశించే ఊర్వశీ ఆ పోస్ట్ పెట్టిందని, అతడ్ని స్టాక్ చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పంత్‌కు ఇష్టం లేకున్నా, అతడ్ని ఎందుకు ఫాలో అవుతున్నావంటూ ఏకిపారేస్తున్నారు.

ఈ విమర్శలకు ఊర్వశీ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘మొదట ఇరాన్‌లో, ఇప్పుడు మన ఇండియాలో.. నన్నే ప్రతీసారి నిందిస్తున్నారు. నేను ఎవ్వరినీ కించపరచలేదు. ఏ వ్యక్తికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయినా, నన్నే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు’’ అంటూ ఊర్వశీ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు స్టాకర్ అర్థం ఏంటో తెలుసుకోండి అంటూ.. గూగుల్‌లో స్టాకర్ పదానికి నిర్వచనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని షేర్ చేసింది. దానికి #StopBullyingWomen అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసింది. అనంతరం ఆస్ట్రేలియా మ్యాప్ షేర్ చేస్తూ.. ‘‘ఇది మన భారత మీడియా కోసం, చూడండి ఆస్ట్రేలియా దేశం ఎంత పెద్దగా ఉందో’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అంటే, తాను ఆస్ట్రేలియాకు వెళ్లింది రిషభ్ పంత్ కోసం కాదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చిందన్నమాట!

కాగా.. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు పయనమైన మరుసటి రోజే ఊర్వశీ రౌతేలా ఆస్ట్రేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా.. ఫ్లైట్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘నా ప్రేమను ఫాలో అవుతూ ఆస్ట్రేలియా చేరుకున్నా’ అనే పోస్ట్ పెట్టింది. దానికి స్టాకర్ అంటూ రిషభ్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వగా, అందుకు పై విధంగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆస్ట్రేలియా అందాల్ని ఆస్వాదిస్తోంది.

Exit mobile version