Site icon NTV Telugu

Urvashi Rautela : రిషబ్‌ పంత్‌తో పెళ్లిపై ఊర్వశి రౌతేలా షాకింగ్ కామెంట్స్

Urvashi Rautela

Urvashi Rautela

Urvashi Rautela Comments on Rishabh Pant Marriage: బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఈ భామ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఆ మధ్యన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తో జరిగిన వివాదంలో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు..ఆ తర్వాత కూడా తన హాట్ ఫొటోషూట్స్‌, కాంట్రవర్సీ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఊర్వశి రిషబ్‌ పంత్‌ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తల్లితండ్రులను ఎప్పుడైనా చూశారా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఊర్వశి రౌతేలాను రిషబ్ పంత్‌ని పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్న అడిగారు. దీనికి ఊర్వశి ‘నో కామెంట్స్’ అని రెండు మాటల్లో సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆమె రిషబ్ పంత్ అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏమైనా చేస్తుందని అనుకున్నారు. కానీ అదేమీ లేకుండా ఆమె ముక్తసరిగా నో కామెంట్స్ అనడం చర్చనీయాంశం అవుతోంది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం 2024 ఐపీఎల్ సిరీస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఆడుతున్నాడు. రాబోయే 2024 T20 ప్రపంచ కప్ సిరీస్ కోసం భారత జట్టులో కూడా రిషబ్ పంత్ పేరు చేర్చారు.

Exit mobile version