Urvashi-Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఈడీ విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పెద్ద వివాదంగా మారింది. తెలుగులో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటివారు విచారణ ఎదుర్కున్నారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి.
Read Also : OG : పవన్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు.. ఈ ఫొటోనే సాక్ష్యం
దీంతో నేడు ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లో విచారణకు హాజరయ్యారు. ఇందులో ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బెట్టింగ్ యాప్స్ ను ఎవరు ప్రమోట్ చేయమన్నారు, ఆ డబ్బులు ఎలా తీసుకున్నారు, ఆ డబ్బు ఏం చేశారు అనే విషయాలపై ప్రశ్నలు కురిపించారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ ఆమెకు సూచించారు. ఊర్వశి గతంలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమాలో సాంగ్ చేసింది.
Read Also : The Rajasaab : రాజాసాబ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..?
