NTV Telugu Site icon

UI : పూజతో మొదలైన ఉపేంద్ర కొత్త చిత్రం

Ui

Ui

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్యారు.

పూజ తర్వాత సుదీప్‌ తొలి క్లాప్ తో సినిమా ఆరంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కలసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. కన్నడ, తెలుగు, తమిళ, హందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందనుంది. దీనికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిచేయనున్నారు.