NTV Telugu Site icon

UiTheMovie : విజయవాడలో సందడి చేసిన ఉపేంద్ర

Ui

Ui

 రియల్ స్టార్ ఉపేంద్ర తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా రరిలీజ్ అయిన ఈ సినిమా  ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్  నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. బుక్ మై షో బుకింగ్స్ ప్రకారం చుస్తే ఈ సినిమా మొదటి రోజు  కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగులోను ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో  వారిని నేరుగా కలిసి కృతఙ్ఞతలు తెలిపేందుకు చిత్ర హీరో ఉపేంద్ర ఆదివారం విజయవాడలో సక్సెస్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ”నేను చాలా అరుదుగా డైరెక్షన్ చేస్తాను. కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నేను డైరెక్ట్ చేసిన ఏ, ఉపేంద్ర మూవీస్ ని ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించడం చాలా సంతోషంగా ఉంది.  ఇప్పుడు యూఐ సినిమాను కూడా ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సఫ్ .  ఈ ఆడియన్స్ ఈ సినిమాకి స్టార్స్.  యుఐ అందరికి కనెక్ట్ అవ్వడం ఆనందంగా వుంది. మీ  జోష్ చుస్తే ఇకపై రెగ్యులర్ గా నా డైరెక్షన్ లో సినిమాలు చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. ఆడియన్స్ ఇంతగా ఇన్వాల్ అయి సినిమా చూడటం థ్రిల్ ఇస్తోంది. నా సినిమాను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు.
Show comments