Site icon NTV Telugu

Kannappa: ‘కన్నప్ప’లో ట్విస్ట్.. పాత్ర మార్చుకున్న ప్రభాస్?

Kannappa Prabhas

Kannappa Prabhas

Update From Kannappa On May 13, Announces Vishnu Manchu : విష్ణు మంచు ‘కన్నప్ప’గా నటిస్తున్న ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం కూడా అధికారికంగా ప్రకిటించారు. ఇక విష్ణు మంచు తన కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు షేర్ చేశారు. ‘కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్లు ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్‌లో ట్రెండ్ అయింది. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం చెబుతున్నాను.

Rakshana: పాయ‌ల్ పాప పోలీసయ్యింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘ర‌క్ష‌ణ‌’ పోస్ట‌ర్ చూశారా?

కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా..నువ్వు ఒక కారెక్టర్ చేయాలని ప్రభాస్‌కు చెప్పాను. ‘కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఈ కారెక్టర్‌ను నేను చేయొచ్చా?’ అని ప్రభాస్ అడిగారు. నేను అడిగిన పాత్ర కాకుండా ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను ప్రభాస్ పోషించారు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రలను గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. త్వరలోనే అన్ని పాత్రల గురించి ప్రకటిస్తాం. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నామని ఆయన అన్నారు. ఇక ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version