ఇటీవలె భీమ్లా నాయక్‌తో మాసివ్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. అదే జోష్‌తో మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీషూట్ కూడా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఇవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జూన్ 7 నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఇరవై రోజులు.. పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. దాంతో హరిహర వీరమల్లు పుకార్లకు చెక్ పెట్టినట్టైంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాంతో హరిహర వీరమల్లు పై భారీ అంచనాలున్నాయి. ఇకపోతే హరిహర వీరమల్లు తర్వాత హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయబోతున్నారు పవర్ స్టార్. అయితే ఈ లోపు తమిళ్ హిట్ మూవీ.. వినోదయ సీతం రీమేక్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మారుస్తున్నారు. తమిళ్‌లో దర్శకత్వం వహించిన సముద్రఖని.. తెలుగులోను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏదేమైనా ఈ సినిమాలతో పవన్ బ్యాక్ టు బ్యాక్ అలరించడం పక్కా అని చెప్పొచ్చు.