NTV Telugu Site icon

Upasana: చిరుకి పద్మ విభూషణ్.. సినీ ప్రముఖులకి ఉపాసన పార్టీ

Upasana Delivery Date Confirmed

Upasana Delivery Date Confirmed

Upasana Throwing Party to Tollywood Biggies: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందుగా ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం ప్రకటించడంతో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులతో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం పద్మ పురస్కారాలు అందుకున్న అందరికీ సత్కారం చేయనుంది.

Sakshi Agarwal: డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని..

ఆ సంగతి అలా ఉంచితే ఇక ఈరోజు రాత్రి సినీ ప్రముఖుల అందరికీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక పెద్ద పార్టీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన మామ గారికి భారతదేశ అత్యుత్తమ పురస్కారాలలో రెండవదైన పద్మ విభూషణ్ లభించడంతో తమ కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయిందని ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడం కోసం సినీ ప్రముఖుల అందరిని పార్టీకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. ఈ రోజు ఈ పార్టీ గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. ఇక ఈమధ్యనే ఉపాసన క్లింకార అనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క హాస్పిటల్ పనులు చూసుకుంటూనే మరోపక్క సమాజ సేవ చేస్తూ వెళ్తున్నారు.

Show comments