మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో తలమునకలైన ఫ్యామిలీ విషయంవచ్చేసరికి మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఉపాసన ఎప్పుడు తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది లేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ ఉపాసన ఎన్నడూ లేనివిధంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోంది. మొదటి నుంచి ఉపాసన, హీరోయిన్ సమంత మంచి దోస్తులన్న విషయం తెలిసిందే.
ఇక తన దోస్త్ గురించి ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.సమంత నుంచి తను చాలా నేర్చుకున్నానని చెప్పింది.”నేను తెలంగాణ బిడ్డను.. మాకు పండగలప్పుడు నాన్ వెజ్ తినడం అలవాటు.. దసరాకు కూడా నేను మాంసం తింటాను.. కానీ, ఎప్పుడైతే సమంతను కలిశానో, ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టానో మాంసం తినడం తగ్గించాను. తాము చాలా మంచిది. ఆమెది చాలా స్వచ్ఛమైన మనసు.. స్వచ్ఛమైన ప్రేమ.. కానీ, అది చాల తక్కువమందికే తెలుసు. సమంతలో సాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది.. అది అందరికి నచ్చుతుంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మెగా కోడలు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
