RRR in VaRRRnasi అంటూ సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోలతో పాటు, దర్శక దిగ్గజం కలిసి పూజలు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన తాజా వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. “ఆర్ఆర్ఆర్” మూవీ దేశవ్యాప్తంగా మార్చ్ 25న విడుదల కానున్న సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి దేశవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ప్రమోషన్ కార్యకమాల్లో మునిగితేలారు. అందులో భాగంగానే మంగళవారం వారణాసికి చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్’ త్రయం అక్కడ గంగా హారతిలో పాల్గొని ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇక వారణాసి ప్రమోషన్లలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా పాల్గొన్నారు. వారణాసి ట్రిప్ కు సంబంధించిన వీడియోను “వారణాసి నువ్వు ఎప్పటిలాగే మ్యాజికల్… ఆర్ఆర్ఆర్ ను చూడడానికి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాను” అంటూ ఉపాసన ఈ స్పెషల్ వీడియోను షేర్ చేసింది.
Read Also : Boycott RRR in Karnataka : అవమానం అంటూ కన్నడిగుల ఆగ్రహం… మేకర్స్ కు షాక్
కాగా పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 25న వెండితెరపైకి రానుంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో అలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, సముద్రఖని, అలిసన్ డూడీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
