NTV Telugu Site icon

Upasana Konidela: గవర్నర్ ను కలిసిన మెగా కోడలు..

Upsi

Upsi

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకొంటూనే ఇంకోపక్క అపోలో బాధ్యతలు చూసుకుంటుంది. ఇక గత ఏడాది క్లింకార రాకతో తల్లిగా కొత్త బాధ్యతలు తీసుకుంది. అయినా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అపోలో ఆస్పత్రిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి పాజిటివ్‌ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ ఉంది. వ్యాపారాన్ని సమర్థవంతంగా చూసుకునే ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది. మహిళలకు మేలు చేసే ఎన్నో మంచి పనులను ఉపాసన తన అపోలో హాస్పిటల్స్ లో చేపట్టింది.

ఇక తాజాగా ఉపాసన.. తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని కలిశారు. గిరిజన సంక్షేమం కోసం ఆమె చేస్తున్న పనుల గురించి లోతైన అవగాహన పొందడం నిజంగా నా హృదయాన్ని తాకింది.మేడమ్, మీ అద్భుతమైన పనికి మీకు వందనాలు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.