NTV Telugu Site icon

Upasana Kamineni తాత పుట్టినరోజు.. ది అపోలో స్టోరీ లాంచ్ చేసిన ఉపాసన

The Apollo Story

The Apollo Story

Upasana Kamineni Konidela launches ‘The Apollo Story’ on Dr. Prathap C Reddy’s 91st Birthday:భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ స్థాపించి అనేక లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో అక్కడి స్టాఫ్ అందరూ తమ వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో జరిగిన వేడుకల్లో ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనవరాలు, మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన తాత గారికి మర్చిపోలేని బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ది అపోలో స్టోరీ అనే బుక్ ని లాంచ్ చేశారు. అపోలో హాస్పిటల్స్ అమరచిత్ర కథ అసోసియేషన్ తో ఈ పుస్తకాన్ని ముద్రించారు.

Arvind Kejriwal: ఇలాంటి డ్రామాలతో దేశం అభివృద్ధి చెందదు.. ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసుపై విసుర్లు..

అపోలో హాస్పిటల్స్ మొదలు పెట్టాలని ఆలోచన ఎలా కలిగింది? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలతో అపోలో ఎదుగుతూ వచ్చింది వంటి విషయాలను పుస్తకంలో వివరించారు. ఈ అపోలో హాస్పిటల్స్ స్థాపించి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ప్రతాపరెడ్డి ఎంత కష్టపడ్డారు? ఎలాంటి చాలెంజెస్ ఫేస్ చేశారు వంటి విషయాలను కూడా పుస్తకంలో రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా ఉపాసన కామినేని మాట్లాడుతూ ఈ పుస్తకం ఇక్కడున్న చిన్న పాపలందరికి పెద్దగా ఎలా కలలు కనాలి అనే విషయం తెలియజేస్తుందని అన్నారు. తమ తాత పడిన కష్టం తెలిసిన తర్వాత నలుగురు మనవరాళ్లు ఎంత కష్టపడి ఇదే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటే ఎందుకు ప్రయత్నిస్తున్నారు అందరికీ తెలుసన్నారు. అలాగే తమ ఆడపిల్లలు అందర్నీ ఎలా ఎంకరేజ్ చేయాలో ఈ పుస్తకం చూసి చదివి తండ్రులందరూ ప్రోత్సహించాలని ఆమె అన్నారు