Site icon NTV Telugu

Ram Charan: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారితో కలిసి రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల దసరా

Ram Charan Dussera

Ram Charan Dussera

Upasana and Ram Charan Celebrates Dussehra with the girls of Balika Nilayam Seva Samaj: మ‌న కుటుంబ సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించి, భావిత‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్రతి ఒక్కరి మీద ఎంతైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి బాధ్య‌త‌ను అద్భుతంగా నెర‌వేర్చారు ఉపాస‌న కామినేని కొణిదెల‌, ఆమె భ‌ర్త‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ దంపతులు. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని అనుస‌రించి రామ్ చరణ్ ఇంట ద‌స‌రా ఉత్స‌వాల‌ను జ‌రుపుకున్నారు. ఉపాస‌న కుటుంబం త‌ర‌ఫున వ‌చ్చిన ఓ సంస్కృతిని ఆచ‌రించి కొన‌సాగించారు రామ్‌ చ‌ర‌ణ్‌. ప్రతి ఏటా బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో క‌లిసి రామ్ చరణ్ దంపతులు ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు. ఉపాస‌న బామ్మ‌, ఈ సేవా స‌మాజ్‌కి మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆస‌రాగా ఉంటూ వస్తున్నారు. ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి బాలికా నిల‌యం సేవా స‌మాజ్ లోని అనాథ బాలిక‌ల‌తో క‌లిసి ఈ దసరా ఉత్స‌వాన్ని జ‌రుపుకున్నారు.

Anasuya: భగవంత్ కేసరిలో బ్యాడ్ టచ్ సీన్.. బ్రో ఐ డోంట్ కేర్ అంటున్న అనసూయ

ప్రేమ‌ను పంచాలి, సానుకూల దృక్ప‌థాన్ని స‌మాజంలో నాటాలి, సంతోషంగా జీవించాల‌నే ఆలోచ‌న‌ల‌ను బాలిక‌ల‌లో పెంపొందించేలా చరణ్ దంపతులు ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజ‌యాన్ని అత్యంత వైభ‌వంగా చాటిచెప్పారు వారు. ఇక మరో పక్క ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల‌కు ఇటీవ‌ల పండంటి పాపాయి జ‌న్మించిన విష‌యం తెలిసిందే, క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టుకున్నారు. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ, కుటుంబ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకునేలా స్టార్ క‌పుల్ పండుగను చేసుకున్న తీరుకు అంద‌రూ ముచ్చ‌ట‌పడుతున్నారు. స్త్రీ శ‌క్తిని ప్ర‌శంసించేలా, ప్రోత్స‌హించేలా, కొనియాడేలా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు చ‌రణ్ దంప‌తులు. మ‌హిళా సాధికారత‌ను అత్యంత అద్భుతంగా కొనియాడే పండుగ ద‌స‌రా. స్త్రీశ‌క్తికున్న ప్రాధాన్యత‌ను న‌వ‌రాత్రుల్లో వ‌ర్ణించే శోభ ఈ పండుగ సొంతం ఆయితే ఆ స్ఫూర్తిని జ‌నాలకు పంచేలా ఈ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు.

Exit mobile version