RRR: ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. నిజంగానే ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా విజయం ముందు మగవారు ఉన్నా వెనుక ఖచ్చితంగా ఆడవారు ఉన్నారు. వారే రమా రాజమౌళి, ఉపాసన, ప్రణతి, వల్లి. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి భార్యలు. సినిమా టెన్షన్స్ లో ఎంత లేట్ గా వచ్చినా, దైర్యం కోల్పోయినా, విమర్శలు ఎదురైనా వారిని పక్కన ఉండి ధైర్యం చెప్పి నిలబెట్టినవారు. అంత ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ లెవెల్ వరకు వెళ్లి గోల్డెన్ గోల్బ్స్ అవార్డును అందుకుంది. అందుకే ఈ సక్సెస్ లో వారు కూడా తమ భాగస్వాములను భాగం చేశారు. వేదికపై కీరవాణి పేరు వినగానే ఆయన మొదట తన భార్య వల్లిని హత్తుకొని వేదికపైకి వెళ్లారు.
ఇక ఈ కార్యక్రమంలో చరణ్ వైఫ్ ఉపాసన, తారక్ వైఫ్ ప్రణతి హైలైట్ గా నిలిచారు. ఉపాసన ప్రస్తుతం గర్భవతి. అయినా భర్త విజయాన్ని చూసి ఆనంద పడాలని ఆమె కూడా భర్తతోనే ఉంది. ఇక స్టార్ వైవ్స్ ఇద్దరు అక్కడ చేసిన హంగామా అంత అయింతా కాదని తెలుస్తోంది. వరుస ఫొటోలతో సోషల్ మీడియాను నింపేశారు. ముఖ్యంగా చరణ్ వైఫ్ ఉపాసన.. సోషల్ ఇండియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. చరణ్ కు సంబంధించిన ఫోటలను, కొత్త కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తారక్, చరణ్ ఎంత మంచి స్నేహితులో.. ఉపాసన, ప్రణతి కూడా అంతే మంచి స్నేహితులు. ఇక తాజాగా వీరి సెల్ఫీ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. భర్తల విజయాన్నీ భార్యలు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట.
