Mallika Rajput: బ్రేకింగ్.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్ కమ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallika Rajput: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రముఖ సింగర్ కమ్ నటి విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్(35) మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబం మొత్తం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆమె మరణించింది అనేది స్పష్టంగా తెలియరాలేదని సమాచారం.
ఇక కూతురు మరణం గురించి తల్లి సుమిత్రా మాట్లాడుతూ.. ” ఈ సంఘటన జరిగినప్పుడు నాకు తెలియదు..నేను నా గదిలో పడుకున్నాను. చాలాసేపటి వరకు గదిలో లైట్ వెలుగుతుండడంతో అనుమానం వచ్చి తలుపు కొట్టాను. ఎంతకు డోర్ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూస్తే.. నా కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్తను, పక్కింటివారిని పిలిచి డోర్ బద్దలుకొట్టి.. మల్లికను ఆసుపత్రికి తరలించాం. అప్పటికే ఆమె చనిపోయింది” అని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మల్లిక గురించి చెప్పాలంటే.. ఆమె సింగర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇంకోపక్క నటిగా కూడా కొనసాగుతోంది. బాలీవుడ్ లో సైతం మల్లిక మంచి హిట్ సాంగ్స్ ను పాడి మెప్పించింది. 35 ఏళ్లకే మల్లికా తనువు చాలించడం బాధాకరమని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య.. ఎవరైనా కావాలని చేశారా.. ? ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..