Urfi Javed: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ఒకసారి ఒంటినిండా పిన్నీసులను కప్పుకొని కనిపిస్తే.. ఇంకోసారి టేప్ కప్పుకొని కనిపిస్తుంటుంది.. మరొకసారి ఫోన్ లు.. అసలు ఒంటిమీద అమ్మడికి బట్టలు నిలవవు అంటే అతిశయోక్తి కాదు. ఛీఛీ ఇలా చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటే.. దానికి ఈ బ్యూటీ చెప్పిన సమాధానం వింటే అవాక్కవ్వకుండా ఉండలేరు. నేను ఇలా ఉంటేనే నాకు నేమ్, ఫేమ్ వచ్చాయి.. అందుకే నేను ఇలాగే ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లో ఒక ప్రాంతంలో ఉర్ఫీ తనదైన స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ కనిపించింది. ఒంటిపై బట్టలు లేకుండా అదేనండీ .. విచిత్రమైన వేషధారణతో ఫోటోషూట్ చేస్తూ కనిపించడంతో దుబాయ్ పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.
“నన్నెవరు అరెస్ట్ చేయలేదు.. దుబాయ్ లో నా ఫోటో షూట్ ను పోలీసులు అడ్డుకున్నారు.. కానీ, అది నా బట్టల వలన కాదు. ఆరోజు లొకేషన్‌లో కొన్ని సమస్యల కారణంగా, షూటింగ్‌ని ఆపడానికి పోలీసులు వచ్చారు. నిర్మాణ బృందం మాకు షూటింగ్‌కు అనుమతించిన సమయాన్ని పొడిగించలేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్, కాబట్టి మేము బయలుదేరాల్సి వచ్చింది. దానికి నా బట్టలతో ఎలాంటి సంబంధం లేదు. మేము మిగిలిన సన్నివేశాలను మరుసటి రోజు చిత్రీకరించాము కాబట్టి సమస్య తీరిపోయింది”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ అరెస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.