నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, బోయపాటి శ్రీను అఖండ టీమ్, దర్శక ధీరుడు రాజమౌళి లతో 5 ఎపిసోడ్లు అలరించిన బాలయ్య 6 వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో సందడి చేయనుండగా.. 7 వ ఎపిసోడ్ లో మాస్ మహారాజ రవితేజతో రచ్చ చేశాడు. ఇప్పటకే ఈ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ సీజన్ ఆఖరి ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలయ్య సందడి చేయనున్నారు. సీజన్ ఫినాలే సూపర్ స్టార్ తో నట సింహం బాలకృష్ణ అంటూ ఆహా పోస్టర్ రిలీజ్ చేసింది. ” రాసి పెట్టుకోండి.. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ల సందడి కనువిందు చేయనుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న అల్లు అర్జున్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా.. నూతన సంవంత్సరం కానుకగా డిసెంబర్ 31 న రవితేజ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు ఎపిసోడ్ల కోసం సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ స్టార్ హీరోలందరితో నందమూరి నటసింహం ఎంతటి రచ్చ చేస్తుందో చూడాలి.
