NTV Telugu Site icon

Unstoppable: కొత్త ప్రోమోలో డోస్ పెంచారు…

Unstoppable Prabhas

Unstoppable Prabhas

నందమూరి బాలకృష్ణ ఎనర్జీకి, ప్రభాస్ స్వాగ్ కూడా తోడవ్వడంతో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 అదిరిపోయింది. అడువుల నుంచి అమ్మాయిల వరకూ బాలకృష్ణ-ప్రభాస్ లు టచ్ చెయ్యని టాపిక్ ఏ లేదు. సినిమాల నుంచి పెళ్లి వరకూ ప్రతిదీ మాట్లాడుకున్న ప్రభాస్ అండ్ బాలకృష్ణలు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని సూపర్ హిట్ చేశారు. ఈ ఇద్దరి దెబ్బకి ‘ఆహా’ యాప్ క్రాష్ అయ్యింది అంటే అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంత వెయిట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రోజులో 100 మిలియన్ మినిట్స్ వ్యూవర్షిప్ ఇచ్చిన ఆడియన్స్ లో మరింత జోష్ పెంచేలా పార్ట్ 2 రెడీ అవుతోంది.

Naga Shaurya: మూడున్నర ఏళ్ల క్రితం సినిమా… ఇప్పుడు బయటకి వస్తోంది

జనవరి 6న ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొత్త ప్రోమోని విడుదల చేశారు, పార్ట్ 1లో ప్రభాస్-బాలకృష్ణలు మాత్రమే ఉంటే పార్ట్ 2లో మ్యాచో హీరో గోపీచంద్ కూడా కలవడంతో ఫన్ డబుల్ అయ్యింది. బాలకృష్ణ-ప్రభాస్-గోపీచంద్ లు కలిసి పార్ట్ 2లో ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్  చెయ్యబోతున్నారు. పార్ట్ 1 కన్నా ఎక్కువ ఫన్, ఎక్కవ హంగామా, ఎక్కువ సీక్రెట్స్ పార్ట్ 2లో బయట పడనున్నాయి. అయితే కొత్త ప్రోమోలో ప్రభాస్, రాము అనే అతని ఉంటే చాలు నాకు అన్నాడు. ఇంతకీ ప్రభాస్ ని కపాడబోయే ఆ రాము ఎవరు అనే క్యురియాసిటీ అందరిలోనూ ఉంది. “వై కట్టప్ప కిల్డ్ బాహుబలి” లాగా “హూ ఈజ్ రాము” అనే క్వేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఆ రాము ఎవరో తెలియాలి అంటే జనవరి 6 వరకూ ఆగాల్సిందే.