NTV Telugu Site icon

Unstoppable: ఇక సోషల్ మీడియా మోత మొగిపోవాలి…

Nbk Pk

Nbk Pk

నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఆహా వాళ్లు ప్రోమోని రిలీజ్ చేసి ఎపిసోడ్ పై అంచనాలని పెంచారు. తాజాగా “Power Star meedha meekunna abhimanam, araadhana ni MASSive scale lo chupettendhuku, mee andhari tharupuna oka kickass DP ready chesam. Anni social media lo inka motha mogipovali anthe. #PSPKOnAhaFEB2 #PawanKalyanOnAHA #NBKOnAHA #UnstoppableWithNBKS2 ” అని కోట్ చేస్తూ ఆహా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఫ్యాన్ అకౌంట్స్ పోస్ట్ చెయ్యడానికి రెడీ చేసిన DP, ఆహా రిలీజ్ చేసిన కాసేపట్లోనే వైరల్ అయిపొయింది. అన్ని ఫ్యాన్ అకౌంట్స్ కామన్ DPని పోస్ట్ చేస్తున్నాయి.

Read Also: NBK108: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

అన్ స్టాపబుల్ షోకి గత రెండు సీజన్స్ లో ఎంతోమంది స్టార్స్ వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ కి చేస్తున్న రేంజ్ సెలబ్రేషన్స్ మాత్రం ఏ హీరోకి చెయ్యలేదు. బాప్ ఆ ఆల్ ఎపిసోడ్స్ అంటూ ఆహా ఈ సీజన్ క్లోజింగ్ ఎపిసోడ్ ని గట్టిగా ప్రమోట్ చేస్తుంది. ఫ్రైడే రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్-బాలకృష్ణల ఎపిసోడ్ ని ఫాన్స్ కోసం ఒక్కరోజు ముందే అంటే గురువారం నైట్ 9గంటలకే స్ట్రీమ్ చెయ్యనున్నారు. ప్రభాస్ వచ్చినప్పుడు ఆహా క్రాష్ అయ్యింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల దెబ్బకి ఇంకేం అవుతుందో చూడాలి.

కొంచెం ఫన్, కొంచెం పాలిటిక్స్, కొంచెం పర్సనల్ ఇలా పవన్ కళ్యాణ్ ని సంబంధించిన అన్ని విషయాలని బాలయ్య ఆడియన్స్ కి తెలిసేలా చెయ్యబోతున్నాడట. ఒక టాక్ షో హిస్టరీలోనే ముందెన్నడూ లేని రికార్డ్స్ ని క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ షో సీజన్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ అయిపోతే మరి సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాని అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? సీజన్ 3 ఉంటుందా లేక ఇక్కడితో బాలయ్య టాక్ షోకి ఎండ్ కార్డ్ పడుతుందా అనేది తెలియాలి అంటే ఈ బాలయ్య-పవన్ కళ్యాణ్ ల ఫైనల్ ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments