NTV Telugu Site icon

అన్ స్టాపబుల్: సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి

unstoppable

unstoppable

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్.. ఈ ఆటంకం లేకుండా కొనసాగుతోంది. బాలయ్య పంచులు స్టార్ల మతులు పోతున్నాయి. ఇటీవల రానాను తనదైన పంథాలో ఒక ఆట ఆదుకున్న బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ లో లైగర్ టీమ్ తో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారగా.. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుండడంతో బాలయ్య పంచకట్టులో కనిపించారు. పైసా వసూల్ చిత్రంతో పూరికి, బాలయ్యకు మధ్య ఉన్న కనెక్షన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఆ అబిమానాన్నే బాలయ్య మరోసారి పూరి జగన్నాథ్ ని ముద్దుగా జగ్గు అని పిలిచి చూపించారు. ఇక తేడా సింగ్ పాత్ర గురించి బాలయ్య గుర్తుచేసుకున్నారు. అంతలో అల్లరి పిడుగు ఛార్మిపై బాలయ్య కౌంటర్లు విసిరారు. అప్పుడు అల్లరి.. ఇప్పుడు పిడుగు అంటూ నవ్వించేశారు.

ఇక సింహం లాంటి జగన్ , పులి లాంటి ఛార్మి నుంచి వచ్చాడు మన లైగర్ అనగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంటర్ అయ్యాడు. విజయ్ తో బాక్సింగ్ స్టైల్లో పంచులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి అంటూ చమత్కరించారు. ఆ తర్వాత విజయ్ కి రౌడీ పేరు ఎందుకు వచ్చిందంటూ అడిగి నిజాలు బయటపెట్టించారు. చివరగా టీమ్ తో బాక్సింగ్ గేమ్ ఆడినట్లు చూపించారు. మొత్తానికి ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పు వస్తుందా అని అభిమానులు ఎదురుచూసేలా ప్రోమోని కట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి మన రౌడీ హీరోను ఈ రౌడీ ఇన్స్ పెక్టర్ ఎలాంటి ప్రశ్నలతో ఆడుకున్నాడో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.