Site icon NTV Telugu

‘అన్ స్టాపబుల్’: రాజమౌళిని రఫ్ఫాడించిన బాలయ్య.. షాకిచ్చిన జక్కన్న

unstoppable

unstoppable

ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సాగా నడుస్తోందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇచ్చి అఖండ విజయాన్ని అందుకొని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు.. అదే విధంగా ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో సెలబ్రిటీలతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్ కి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో విచ్చేయనున్నారు అనే విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ 5వ ఎపిసోడ్ ప్రోమోను ఆహా వారు రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ గా అడిగే ప్రశ్నలకు జక్కన్న క్రేజీ రియాక్షన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి.

” మీరు మేధావి అని, అఛీవర్ అని అందరికి తెలుసు.. అయినా ఎందుకు ఈ తెల్లగడ్డం’.. ‘ఇప్పటివరకు మన కాంబినేషన్ పడలేదు.. నా అభిమానులు అడుగుతున్నారు .. నాతో సినిమా ఎప్పుడు’.. ‘మీతో సినిమా చేస్తే హీరోకి , ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు .. ఆ తరువాత వారి రెండు సినిమాలు ఫసక్ అంట’గా అని బాలయ్య గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు అడుగుతన్నా జక్కన్న కనీసం నోరుకూడా మెదపలేదు.. ఇంటర్వ్యూ కి వచ్చిసమాధానాలు చెప్పరేంటని అడుగగా.. రాజమౌళి..”మీకు తెలుసు.. నాకు తెలుసు .. చూస్తున్నవారి అందరికి తెలుసు ఇది ప్రోమో అని.. వీటన్నింటికి సమాధానాలు ఎపిసోడ్ లో చెప్తా” అని చివరికి షాక్ ఇవ్వడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈ ప్రోమో తో రాజమౌళి , బాలయ్య ఎంటర్ టైన్మెంట్ ని చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య అడిగిన ప్రశ్నలకు జక్కన్న ఎలాటి సమాధానాలు చెప్తాడో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Exit mobile version