Balakrishna: ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఫాన్స్‌ని కొడతాడు, ఫోన్స్ విసిరేస్తాడు.. ఇలా ఏవేవో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అనే పేరు వినగానే అందరికి థింకింగ్ మారిపోయింది. జై బాలయ్య అనేది ఒక స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయ్యింది. ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షో ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అన్‌స్టాపబుల్ షో నిజంగానే బాలయ్య పట్ల ఉండే థింకింగ్‌ని పూర్తిగా మార్చేసింది. ఈ టాక్ షోలో బాలయ్యని చూస్తున్న వాళ్లు, ఇన్ని రోజులు మనం వినింది ఇతని గురించేనా? బాలయ్య ఇంత సరదాగా ఉంటాడా? అంత స్పాంటేనియస్‌గా పంచులు వేస్తాడా? చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరితో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతాడా? అని స్వీట్ షాక్‌కి గురవుతున్నారు. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంటైర్ టాక్ షోస్‌లోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంటే.. బాలయ్య చేస్తున్న మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో కన్నా బాలయ్య అంటే ఆడియన్స్‌లో ముఖ్యంగా యూత్‌లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అందుకే సినిమా వాళ్లు కూడా ఎప్పుడూ లేనిది ఈ మధ్య బాలయ్యని స్పెషల్ గెస్ట్‌గా పిలిచి ఈవెంట్స్ చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షో కన్నా ముందు బాలయ్య బయట సినిమా ఫంక్షన్స్‌కి వచ్చి మాట్లాడింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలని బాలయ్య ప్రమోట్ చేస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన బాలయ్య, తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ‘దాస్ కా దమ్కీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కూడా గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. ఈ ఈవెంట్స్‌లో బాలయ్య ఎనర్జీ అండ్ హార్ట్‌ఫెల్ట్ స్పీచులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా పిలిచిన ప్రతి ఒక్కరి సినిమా ఈవెంట్‌కి వెళ్తున్న బాలయ్య, అందరి హీరోల అభిమానులని అట్రాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య క్యారీ చేస్తున్న ఈ పాజిటివ్ ఆరా తన సినిమా కలెక్షన్స్‌పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
