Site icon NTV Telugu

Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ

Unstoppable With Nbk

Unstoppable With Nbk

Unstoppable 4 Announcedd by AHA Video: నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే దాదాపు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో కి సంబంధించిన మరో సీజన్ ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ టాక్ షో మళ్లీ వస్తోంది, అయితే ఈసారి ఒక ట్విస్ట్ తో మీ ముందుకు వస్తోంది అంటూ ఈ టాక్ షో స్ట్రీమింగ్ చేసిన ఆహా వీడియో సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆ ట్విస్ట్ ఏమిటి? ఎప్పటి నుంచి ఈ షో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయం మీద క్లారిటీ లేదు.

Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణని బాబీ ఒక అవుట్ అండ్ డౌట్ మాస్ లుక్ లో చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో వీరిద్దరి కాంబినేషన్ అంటేనే పూర్తిస్థాయి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

Exit mobile version