NTV Telugu Site icon

Unstoppable 3: చిరంజీవితో ఎపిసోడ్ అని ఊరించి ఉసూరుమనిపించారు!

Chiranjeevi Unstoppable With Nbk

Chiranjeevi Unstoppable With Nbk

Unstoppable 3 First Episode with Bhagavanth Kesari Team: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు సీజన్లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న టాక్ షో, మూడో సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే మొదటి రెండు సీజన్లను సీజన్ 1, సీజన్ 2 అని పిలవగా ఈ మూడవ సీజన్ ను మాత్రం లిమిటెడ్ ఎడిషన్ అని సంబోధిస్తున్నారు. అయితే ఈ అన్ స్టాపబుల్ కొత్త సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది.

Dhanraj: డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?

చాలా మంది అది నిజమే అని నమ్మారు కూడా. బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఎపిసోడ్ చేస్తున్నారు అంటే ఇక ఆ రికార్డులు వేరే లెవల్లో ఉంటాయని అందరూ లెక్కలు వేసుకున్నారు. అయితే హింట్స్ కూడా అదే విధంగా రావడంతో మెగాస్టార్ ఈ షోకి రావడం ఖాయం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊదరగొట్టి ఉసూరుమనిపించినట్టు చిరంజీవి మొదటి ఎపిసోడ్ కి రావడం లేదని చెబుతూ ఈసారి ఎవరు ఎవరు వస్తున్నారనేది ఆహా టీం వెల్లడించేసింది. దసరా కంటే ముందుగానే ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం రాబోతుందని ఆహా టీం చూచాయగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో కనిపించబోతున్నారని అంటున్నారు.

Show comments