NTV Telugu Site icon

Unni Mukundan: టాలీవుడ్ మీద కన్నేసిన మరో మల్లూ హీరో

Jai Ganesh

Jai Ganesh

Unni Mukundan – Mahima Nambiar starrer Jai Ganesh first look poster Released: ఇప్పటికే పలువురు మలయాళ స్టార్ హీరోలు తెలుగు సినీ పరిశ్రమ మీద ఫోకస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తుండగా ఇప్పుడు మిన్నల్ మురళి ఫేమ్ టోవినో థామస్ కూడా ఒక బై లింగ్యువల్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వారి బాటలోనే మరో మలయాళ హీరో రెడీ అవుతున్నాడు. ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న `జైగణేష్` సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రంజిత్ శంకర్ దర్శకత్వంలో UMF & డ్రీమ్స్ N బియాండ్ ప్రొడక్షన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఒరియా వంటి ఐదు భాషల థియేటర్లలో, వేసవి టార్గెట్ గా 2024 సమ్మర్ లో విడుదలకాబోతుంది. `జైగణేష్` సినిమా లో ఉన్ని ముకుందన్ పాత్ర అత్యంత ఛాలెంజింగ్‌ రోల్స్ లో ఒకటని చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు మెచ్చేవిధంగా థ్రిల్లింగ్ బ్యాక్‌ డ్రాప్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోందని చెబుతున్నారు.

Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని కలలో ముందే ఊహించా.. వైరల్ అవుతున్న ట్వీట్

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా, రంజిత్ శంకర్ కు చెందిన డ్రీమ్స్ ఎన్ బియాండ్ ప్రొడక్షన్స్ ,ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ భాగస్వామ్యంతో రూపొందించబడుతుంది. మహిమ నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జో మోల్ కొంత గ్యాప్ తర్వాత క్రిమినల్ లాయర్‌గా ఒక స్పెషల్ రోల్ లో కన్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హరీష్ పేరడి, అశోక్, రవీంద్ర విజయ్, నందు తదితరులు ఉన్నారు. మాలికాపురం తర్వాత జై గణేష్ అనే పేరుతో ఈ సినిమా చేస్తుండగా ఎర్నాకులం పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు షూట్ జరుగుతోంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ చంద్రు సెల్వరాజ్, ఎడిటర్ సంగీత్ ప్రతాప్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ శర్మ వంటి వారు పనిచేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని మెకాన్ వెల్లడించారు.