భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ ప్రత్యేక చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మా వందే పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మోదీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉన్ని ముకుందన్ మోదీ వేషధారణలో కనిపించిన ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
ఈ సినిమాలో మోదీ వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను చూపించనున్నారు. ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు ఇందులో ప్రధానాంశాలు కానున్నాయి. ప్రత్యేకంగా మోదీ తన తల్లి హీరాబెన్ పట్ల చూపిన మమకారం, ఆమె సంకల్పబలం ఆయన జీవితానికి ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని హృదయానికి హత్తుకునేలా చూపనున్నారు. కాగా మా వందే చిత్రాన్ని దక్షిణాది, ఉత్తరాది భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దర్శకుడు క్రాంతికుమార్ ఈ సినిమా నుండి ఉన్ని ముకుందన్ మోదీగా కనిపించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి అంచనాలు పెంచింది. మోదీ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు, రిలీజ్ డేట్‌ను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
