NTV Telugu Site icon

Ramoji Film City: గిన్నీస్ బుక్లో రికార్డుల.. 2000 ఎకరాలు.. 2500 సినిమాలు.. రామోజీ ఫిలిం సిటీ గురించి మీకు ఇవి తెలుసా?

Ramoji Film City Ramoji Rao

Ramoji Film City Ramoji Rao

Ramoji Film City Unknown Facts: రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం అదేనండీ ఫిలింసిటీ. హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, నిర్మించబడుతున్నాయి. ఇందులో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఈ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Ramoji Rao: నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీరావు

సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందిందనే చెప్పాలి. ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్‌ సిటీని సందర్శిస్తున్నారు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్‌ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం రామోజీరావుకు మాత్రమే కాదు హైదరాబాదుకు కూడా ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.
ఇక ఫిల్మ్ సిటీతో పాటు ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా రామోజీరావు స్థాపించారు. ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాల చిత్రీకరణ జరిగినట్లు అంచనా. ఇక్కడ చిత్రీకరించిన కొన్ని బ్లాక్‌బస్టర్‌లలో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి మరియు డర్టీ పిక్చర్ ఉన్నాయి.

Show comments