NTV Telugu Site icon

Salman khan: సల్మాన్ ఇంటిపై కాల్పులకు ముందే బెదిరింపు కాల్.. కానీ?

Salman Khan

Salman Khan

Unknown Caller Warned Police Control Room at Lawrence Bishnoi Gang: సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పుల ఘటనలో రోజుకో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై పోలీసులు ఇప్పుడు షాకింగ్ సమాచారం ఒకటి ఇచ్చారు. గత ఆదివారం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరగడానికి ముందు, గుర్తుతెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసినట్లు పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మనిషి ముంబైకి వచ్చి పెద్ద విషయం చేయబోతున్నాడని హెచ్చరించాడని చెబుతున్నారు. అయితే ఈ అంశం సల్మాన్ ఖాన్ భద్రత, ముంబై పోలీసుల జవాబుదారీతనంపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ‘బెదిరింపు ఫోన్ కాల్’ తర్వాత ముంబై పోలీస్ కంట్రోల్ స్థానిక పోలీస్ స్టేషన్‌ను హెచ్చరించినట్టు ముంబై పోలీసులు తన తాజా ప్రకటనలో తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ మనిషి ముంబైకి వస్తాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. దీంతో ముంబై పోలీసులు, ఆర్పీఎఫ్ అప్రమత్తమయ్యారు. ఏప్రిల్ 14న తెల్లవారుజామున 4:55 గంటలకు బైక్‌పై వచ్చిన ఇద్దరు షూటర్లు సల్మాన్ ఖాన్ ఇంటిపై నాలుగు బుల్లెట్లు పేల్చి పారిపోయారు.

Gunturu Karam: రికార్డ్ సృష్టించిన ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌.. ఏకంగా..

ఈ ఇద్దరు షూటర్లను అహ్మదాబాద్ పోలీసులు రెండు రోజుల తర్వాత గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరికీ 10 రోజుల పోలీసు రిమాండ్‌ విధించారు. సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన కాల్పులపై ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో షూటర్లు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21)లను మంగళవారం అరెస్టు చేయగా, పోలీసులు వారిని రిమాండ్‌కు తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వారిద్దరూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో పరిచయం ఉన్నట్లు ఒప్పుకున్నారని, రూ.4 లక్షలకు సుపారీ తీసుకున్నట్లు చెప్పారని చెబుతున్నారు. అయితే సల్మాన్‌ఖాన్‌ను చంపడానికే ఇద్దరూ వచ్చారని పోలీసులు కోర్టులో చెప్పగా, నిందితులిద్దరూ తమ ఇంటిపై 10 బుల్లెట్లు పేల్చి సూపర్‌స్టార్‌ని భయపెట్టారని అంటున్నారు. ఈ కేసులో మరో అప్‌డేట్ ఏమిటంటే, ఏప్రిల్ 19, శుక్రవారం నాడు పోలీసులు యుపికి చెందిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ అనుమానితుడు లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి రెండు సార్లు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే, అరెస్ట్ అయిన తర్వాత, ఘజియాబాద్ నివాసి రోహిత్ త్యాగి, తాను నటుడి అభిమానినని, చిలిపిగా ఈ పని చేశానని చెప్పాడు.