కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… సౌత్ మార్కెట్ ని సొంతం చేసుకోని ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, సిరుత్తే శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మరింత పెంచుతున్నారు మేకర్స్. ఈ భారీ బడ్జట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.
Read Also: Dhruva Natchathiram: హీరోగారు ఈ ప్రాజెక్ట్ ని అసలు పట్టించుకుంటున్నట్లు లేదుగా
సూర్య, బాబీ డియోల్, దిశా పఠాని… ఇతర కాస్ట్ పైన ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నాడు శివ. ఇదిలా ఉంటే కంగువా సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ ఉంటాయని సమాచారం. అండర్ వాటర్ ఫైట్, ఫారెస్ట్ ఫైట్, ఫ్లైట్ లో ఫైట్, బీచ్ ఫైట్, బోట్ ఫైట్, జిమ్ ఫైట్… ఇలా మొత్తం ఆరు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కంగువ సినిమాలో ఉంటాయట. ఈ ఫైట్స్ లో అండర్ వాటర్ లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Read Also: Katrina Kaif: శారీ పిక్స్ తో చెమటలు పట్టిస్తున్న కత్రినా కైఫ్