NTV Telugu Site icon

Mr. Pregnant: ‘విజయ్’కి అర్జున్ రెడ్డి, ‘సిద్దు’కి డీజే టిల్లు, ‘సోహైల్’కి మిస్టర్ ప్రెగ్నెంట్

Mr Pregnant

Mr Pregnant

Ulta Palta Song Launched from Mr. Pregnant Movie: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు సిద్ధం అయిపోయింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ పై దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉల్టా పల్టా అనే సాంగ్ ను మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా రిలీజ్ చేయగా ఈ క్రమంలో హీరో సోహైల్ మాట్లాడుతూ – దర్శకుడు శ్రీనివాస్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇన్నోవేటివ్ గా అనిపించిందని అన్నారు. కొద్ది సేపటికి ఇంకో కథ ఉంది వింటావా అన్నారని అయితే తాను మిస్టర్ ప్రెగ్నెంట్ కథే చేద్దామని ఫిక్స్ అయ్యానని అన్నారు. ఎందుకంటే ఇవాళ ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని పేర్కొన్న ఆయన ఈ సినిమా కూడా వాళ్లకు అలాంటి అనుభూతి అందిస్తుందని నమ్మానని అన్నారు.

Boys Hostel : తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’

ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్ షాప్స్ చేశామని, రియల్ గా ప్రెగ్నెన్సీ అంత బరువుండే ప్రొస్థటిక్స్ వాడామని అన్నారు. ఈ సినిమా మొదలైన కొత్తలో కొన్న ట్రోల్స్ వచ్చాయి కానీ ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే సినిమా అని అన్నారు. ఎక్కడా ప్రెగ్నెన్సీ మీద కామెడీ డైలాగ్స్ పెట్టలేదని, చాలా హుందాగా ఒక కథను తెరకెక్కించామని అన్నారు. సినిమా చూశాక మీ సిస్టర్స్, మదర్ ను హగ్ చేసుకుంటారని పేర్కొన్న ఆయన ఈ సినిమా ఒప్పుకున్న టైమ్ లో మా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్స్ గా ఉన్నారని, వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇకపై కూడా ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తాను అన్నారు. అంతేకాక ‘విజయ్’కి అర్జున్ రెడ్డి, ‘సిద్దు’కి డీజే టిల్లు, నాకు ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Show comments