The Trial Star Noor Malabika Passed: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి పనిచేసిన ఖతార్ ఎయిర్‌వేస్ మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు. మలాబికా ముంబైలోని తన ఇంట్లో శవమై కనిపించింది. మలాబికా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే నటి హఠాన్మరణం చెందిందన్న వార్త అందరినీ కలచివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ 6న నూర్ మలాబికా దాస్ మృతదేహాన్ని ఆమె లోఖండ్‌వాలా నివాసం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . ఫ్యాన్‌కు వేలాడుతున్న మలాబికా మృతదేహం కనిపించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Chandra Babu: చంద్రబాబుతో టాలీవుడ్ హీరో భేటీ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
అయితే మలాబికా మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. నూర్ మలాబిక ఇంటి సమీపంలో నివసించే వారు ఆమె ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకి తెలిపారు. పోలీసులు నటి ఇంటి తలుపులు పగులగొట్టి ఫ్లాట్‌లోకి వెళ్లి తనిఖీ చేశారు. పోలీసులు లోపలికి వెళ్లి చూడగా నూర్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు నూర్ కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, ఎవరూ అందుబాటులోకి రాలేదని, ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకోలేదని కూడా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో, అనాధ శవాలు, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను దహనం చేసే ఎన్జీవో సహాయంతో పోలీసులు ఆదివారం నూర్ అంత్యక్రియలు నిర్వహించారు.
నూర్ మలాబికా దాస్ వయసు 32 సంవత్సరాలు. ఆమె అస్సాం రాష్ట్రానికి చెందిన యువతి. ఖతార్ ఎయిర్‌వేస్ ఎయిర్ హోస్టెస్ గా పని చేసి సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత హిందీ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లలో పనిచేసింది. ఉల్లు యాప్‌లో నూర్ మలాబిక సిరీస్ లు ఎక్కువ రిలీజ్ అయ్యాయి. సిసాకియాన్, వాక్‌మ్యాన్, స్పైసీ చట్నీ, ప్యూబిక్ రెమెడీ, ఉద్వేగం, దేఖి ఉండేఖి, బ్యాక్‌రోడ్ హస్టిల్` మొదలైన వాటిలో ఆమె నటించిం. ఐదు రోజుల క్రితం నవ్వుతూ తన వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమె పెట్టిన ఆ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.