NTV Telugu Site icon

Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో

Court

Court

ఈ నెల 14న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్ని బాషల సినిమాలు కలిపి దాదాపు డజను సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే ఓ ఇద్దరు నిర్మాతలు మాత్రం తమ తమ సినిమాలు గురించి ప్రీ రిలీజ్ వేడుకల్లో భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వివరాళలోకెళితే నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై యంగ్ కమెడియన్ కమ్ నటుడు ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్ ముఖ్యపాత్రల్లో ‘కోర్ట్’ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ‘ ప్రొడ్యూసర్ గా నా సినిమాపై నాకు నమ్మకం ఉండడం సహజం కానీ నేను బలంగా చెప్తున్న ఈ నెల 14న విడుదలయ్యే ‘ కోర్ట్’ గురించి నేను చెప్పింది తప్పయితే సినిమా మీకు నచ్చకుంటే మరో రెండు నెలల్లో నేను హీరోగా నటించిన ‘హిట్ 3′ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను చూడకండి’ అని అన్నాడు.

ఇక మరో నిర్మాత రవి కుమార్ . కిరణ్ అబ్బవరం హీరోగా ఈయన నిర్మించిన చిత్రం దిల్ రూబా. ఈ మంగళవారం ఈ మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘ నేను సినిమా చూసుకున్నాను. చాలా బాగా నచ్చింది. మీ అందరికి తప్పకుండ నచ్చుతుంది. ఈ సినిమాలో ఫైట్స్ చూసి మీరు అందరు థియేటర్ స్క్రీన్స్ చింపి అవతల వేస్తారు. అంత హై ఇస్తుంది. ఒకవేళ మీకు అలా అనిపించకుంటే రిలీజ్ రోజు మధ్యాహ్నం పెట్టె ప్రెస్ మీట్ లో నన్ను చితక్కొట్టేయండి’ అని అన్నారు. మరి ఈ ఇద్దరు నిర్మాతలు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎవరి మాటల్లో ఎంత నిజముందో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.