NTV Telugu Site icon

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంలో ట్విస్ట్..

Ntr Promise

Ntr Promise

Twist in Jr NTR Land Issue: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం హైకోర్టుకు చేరుకున్నట్టు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేయగా తనకు అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయని తెలిపారు. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫిర్యాదు చేయండంతో భూమిని విక్రయించిన సుంకు గీతపై కేసు నమోదైందని అన్నారు. అయితే బ్యాంకులకు హక్కులు ఉంటాయని DRT ఇచ్చిన తీర్పుపై హై కోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఇంటి రిజిస్టర్ GPA హక్కుదారు కిలారు రాజేశ్వర రావు ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ కోర్టును రాజేశ్వర రావు కోరగా DRT ఉత్తర్వులను పక్కకు పెట్టాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది.

Actor Darshan case: రేణుకా స్వామిని చంపేందుకు 17 మంది కుట్ర.. దర్శన్ కేసులో సంచలన విషయాలు..

రికవరీ అధికారి ఇరు పార్టీలను విచారించి చట్టానికి అనుగుణంగా త్వరితగతిన క్లెయిమ్ పిటిషన్ పరిష్కరించాలని కోర్టు సూచించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఇంటితో సంబంధం లేదని కిలారు రాజేశ్వర రావు పేర్కొన్నారు. 2012 లో రిజిస్టర్ GPA చేసుకొని, 2013లో ఇంటిని నా పేరుతో రిజిస్త్రేషన్ చేసుకొన్నానని, ఈ వ్యవహారంలో గతంలోనే సీసీఎస్ లో కేసు నమోదు చేశానని అన్నారు. సుంకు ఆటో లిమిటెడ్ చైర్మన్ సుంకు విష్ణు చరణ్ తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారని అన్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు స్థలాన్ని గీతా సంతోష్ విక్రయించారు. గీతా సంతోష్ సంతకాల తో పాటు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆమె మరిది విష్ణు చరణ్ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఇక ఇదే అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ టీం కూడా అప్పట్లో స్పందించింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారు, ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించవద్దు” అని ట్విట్టర్ వేదికగా టీం ప్రకటించింది.