NTV Telugu Site icon

TV Actress Shalini: విడాకులు తీసుకుంది.. ఫోటోలు చించి పండగ చేసుకుంది

Shalini Divorce Case

Shalini Divorce Case

TV Actress Shalini Celebrated Her Divorced: మారుతున్న కాలానికి అనుగుణంగా.. సెలెబ్రిటీలు సరికొత్త ట్రెండ్‌లకు తెరతీస్తున్నారు. ఊహించని సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇప్పుడు ఓ టీవీ నటి.. తన విడాకులను పండుగల వేడుక చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటే, ఆ వ్యవహారం కాస్త వాడీవేడీగా నడుస్తుంది. ఆ తారలతో పాటు వారి అభిమానులు సైతం నెట్టింట్లో తమ బాధను వ్యక్తపరుస్తుంటారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ.. విచారం తెలుపుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే.. అది ఒక విషాదకరమైన మూమెంట్. కానీ.. టీవీ నటి షాలిని మాత్రం తన విడాకుల్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన పెళ్లి ఫోటోలను చించుతూ.. ఒక ఫోటోషూట్ కూడా నిర్వహించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Gangula Kamalakar: రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ

తమిళ ఇండస్ట్రీకి చెందిన టీవీ నటి షాలినికి మంచి పాపులారిటీ ఉంది. ముల్లుమ్ మల్లరుమ్ అనే సీరియల్‌తో ఈమె ఫేమ్ సంపాదించింది. జీ తమిళ్‌లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలోనూ పాల్గొంది. కట్ చేస్తే.. షాలిని గతంలో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో ఒక కుమార్తెను కూడా కనింది. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. భర్త రియాజ్ తనని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కొన్ని నెలల క్రితం షాలిని కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన కోర్టు.. తాజాగా విడాకులకు మంజూరు తెలిపింది. మొత్తానికి తాను అనుకున్నది సాధించడంతో.. ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా.. ఫోటోషూట్ నిర్వహించి, చాలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన మాజీ భర్తతో కలిసి దిగిన ఫోటోలను సగానికి చించేస్తూ.. ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..

‘‘తమ గళం విప్పడానికి భయపడుతూ లోలోపలే మదన పడుతున్న వారికోసం.. విడాకులు తీసుకున్న నా నుంచి ఇదే మీకు సందేశం. దాంపత్య జీవితం సాఫీగా సాగనప్పుడు.. ఆ బంధం నుంచి బయటకు రావడమే ఎంతో శ్రేయస్కరం. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తుని మెరుగుపరచుకోవడం కోసం.. తగిన మార్పులు చేసుకోండి. విడాకులు తీసుకున్నంత మాత్రాన మనం ఫెయిల్ అయినట్టు కాదు. మీ జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్. మీ జీవితంలో సానుకూల మార్పుకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి కాబట్టి.. నాలాంటి ధైర్యవంతులైన మహిళలకు ఇది అంకిత చేస్తున్నా’’ అంటూ రాసుకొచ్చింది.

Show comments