Reshma Prasad: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ మంచివాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందరూ వేరేరకంగా చూసేవాళ్ళే. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. ఒకప్పుడు ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నవారే. అవకాశాలు కావాలంటే.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో పక్కన పడుకోవాలి అని ఆడిషన్ కు వెళ్ళినప్పుడే చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇక అలా అవకాశాల కోసం తన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి క్యాస్టింగ్ డైరెక్టర్లు ఏది చెప్తే అది చేసేవాళ్ళు ఎంతోమంది. అందులో నేను కూడా నేను కూడా ఒకదాన్ని అంటుంది.. నటి రేష్మ ప్రసాద్. సినిమాల్లోనే కాదు సీరియల్ లో కూడా తనను కాంప్రమైజ్ కావాలని అడిగినట్లు ఆమె తెలిపింది. మలయాళ సీరియల్ భారతి కన్నమ్మ 2 అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రేష్మ ప్రసాద్. ఈ సీరియల్ తరువాత ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో ఆమె జీవితంలోని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.
Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు
” నేను కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని. ఆ పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడిగేవారు. గదిలోకి రావడానికి అడ్జెస్ట్మెంట్ అయితే.. ఈ పాత్ర నీదే అని చెప్పేవారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంది. అందులో ఒప్పుకోను అని రాసినా.. వారు దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి అడిగి ఒత్తిడి తెస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను వారితో పడుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే.. పైకి కనిపించే ఇండస్ట్రీ వేరు.. లోపల ఉన్న ఇండస్ట్రీ వేరు. ఇప్పుడైనా తమను తాము తెరపై చూసుకోవాలని కోరుకొనే అమ్మాయిలకు ఇండస్ట్రీ మంచి వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.