NTV Telugu Site icon

Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు

Gowri Nair Photos Leaked

Gowri Nair Photos Leaked

TV Actress Praveena Daughter Gowri Nair Morphed Photos Leaked: కొందరు కీచకులు ఆన్‌లైన్‌లో నటీమణుల్ని టార్గెట్ చేసి, వారిని వేధిస్తుంటారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసి, పైశాచికానందం పొందుతుంటారు. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేమ్ ప్రవీణాను సైతం ఓ దుండగుడు టార్గెట్ చేశాడు. ఆమెని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు. ఆ కీచకుడి పేరు భాగ్యరాజ్. ఢిల్లీకి చెందిన అతగాడు.. గతంలో ప్రవీణా ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోల విషయం తెలుసుకున్న ప్రవీణా, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతడి ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు.

Rishabh Pant: రిషభ్ పంత్ ముంబైకి తరలింపు.. అవసరమైతే అమెరికాకి కూడా

కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన భాగ్యరాజ్, కొన్ని నెలలు గడిచాక మళ్లీ ప్రవీణాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఈసారి ప్రవీణాతో పాటు ఆమె కూతురు గౌరీ నాయర్‌ని కూడా టార్గెట్ చేశాడు. గౌరీ ఫోటోలని నగ్న ఫోటోలతో మార్ఫింగ్ చేసి, ఆన్‌లైన్‌లో విడుదల చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న ప్రవీణా.. ఈసారి తన కూతురు గౌరీతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. గతంలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తే, ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని పేర్కొంది. మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో వాపోయింది. చివరికి తన బంధువులతో పాటు స్నేహితుల్ని సైతం అతడు విడిచిపెట్టడం లేదని.. తనతో ఉన్న మహిళల ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

తన పేరు మీద భాగ్యరాజ్ వందకు పైగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడని.. ఆ సోషల్ మీడియా ఖాతాల్లో తనతో పాటు తన కూతురు, తన బంధువులవి మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని షేర్ చేస్తున్నాడని ప్రవీణా పేర్కొంది.. గతంలోనే అతనికి తగిన శాస్త్రి చేసినా మార్పు రాలేదని, ఈసారి అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అతడు మరీ దారుణంగా ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తున్నాడని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.