Site icon NTV Telugu

Jeevitha: హీరోయిన్ ఆఫర్ ఇస్తా.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కు వస్తావా అన్నాడు

Jeevitha

Jeevitha

Jeevitha: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ముఖ్యంగా హీరోయిన్లు.. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నవారే. అయితే కొందరు బయటపెడతారు.. ఇంకొందరు బయటపెట్టరు. అంతే తేడా. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. ఎలాంటి లైంగిక వేధింపులకు గురైన దాచుకోకుండా ధైర్యంగా మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఒక తమిళ నటి తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కడైకుట్టి సింగం అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న నటి జీవిత. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి, దానివలన పోయిన ఆమె ఆఫర్ల గురించి చెప్పుకొచ్చింది.

Priyanka: రహస్యంగా మలేషియాలో ప్రేమించిన వాడిని పెళ్లాడిన ప్రియాంక

“నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక దర్శకుడు వద్దకు ఆడిషన్ కు వెళ్ళాను. ఆయన హీరోయిన్ గా నాకు ఆఫర్ ఇస్తాను అన్నాడు .. అంతేకాకుండా అధిక రెమ్యూనిరేషన్ ఇస్తాను అన్నాడు.. వరుస అవకాశాలను ఇస్తాను అన్నాడు. అయితే వాటికోసం కొద్దిగా సర్దుకుపోవాలి అని చెప్పాడు. డైరెక్టర్, కెమెరా మ్యాన్, నిర్మాత, మేనేజర్ లతో సర్దుకుపోవాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కు రావాలి అని చెప్పాడు. నేను అప్పుడే మొదటిసారి డైరెక్టర్ తో మాట్లాడం.. ఆయన చెప్పిన మాటలకు ఏం చేయాలో తెలియక ఏడ్చేశాను. చాలా అవమానంగా ఫీల్ అయ్యా. అక్కడి నుంచి బయటకు వచ్చేసి.. రెండోసారి ఆ డైరెక్టర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version